ఒకే మ్యాచ్‌లో పాక్, శ్రీలంక రికార్డుల మోత.. ఒకటి పరమ చెత్తది.. మరోటి సరికొత్తది!

  • కొనసాగుతున్న శ్రీలంక పరాజయాలు
  • ఒకే కేలండర్ ఇయర్‌లో అత్యధిక ఓటములు మూటగట్టుకున్న లంకేయులు
  • వరుసగా అత్యధిక ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుచుకున్న జట్టుగా పాక్ రికార్డు
పాకిస్థాన్-శ్రీలంక మధ్య దుబాయ్‌లో జరిగిన రెండో టీ20లో రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఇందులో ఒకటి అత్యంత చెత్త రికార్డు కాగా, రెండోది ఘనమైన రికార్డు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 124 పరుగులు చేసి పాకిస్థాన్‌కు 125 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి పాక్ ఓ బంతి మిగిలి ఉండగా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌ లో పోరాడి ఓడిన శ్రీలంక అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. శ్రీలంకకు ఇది ఈ ఏడాది 33వ పరాజయం. ఓ కేలండర్ ఇయర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇన్ని మ్యాచుల్లో ఓ జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు జింబాబ్వే పేరుపై ఉండగా, శ్రీలంక ఆ జట్టును వెనక్కి నెట్టింది. మరోవైపు ఇదే మ్యాచ్‌లో గెలవడం ద్వారా పాక్ సరికొత్త రికార్డును లిఖించింది. టీ20 చరిత్రలో వరుసగా ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుచుకున్న జట్టుగా పాక్ రికార్డులకెక్కింది.
 
Go Back to Shorts
Pakistan
Srilanka
Dubai
Record
Cricket

More Telugu News